మునిగిపోయిన స్టాక్ మార్కెట్.. ₹12 లక్షల కోట్లు మటాష్! అసలు కారణం ఇదే..
Published on: 19 Mar 2026, 11:54 AM
ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ డే! అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో దలాల్ స్ట్రీట్ అతలాకుతలమైంది. ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే అక్షరాలా 12 లక్షల కోట్లు గాలిలో కలిసిపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు, చమురు సరఫరాపై పడుతున్న ప్రభావం మార్కెట్లను పాతాళానికి తొక్కేసింది. దాదాపు అన్ని ప్రధాన రంగాల షేర్లు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందా అనే ఆందోళనలో ట్రేడర్లు ఉన్నారు.