మున్సిపల్ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో పోలియో డ్రైవ్!
చౌటుప్పల్, జూన్ 28 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్ల లోపు చిన్నారులకు వేసే పల్స్ పోలియో చుక్కలు ప్రతి బిడ్డకు రక్షణ కవచం లాంటివని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. ఆదివారం చౌటుప్పల్ బస్టాండ్ ఆవరణతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఈ చుక్కలు వేయించి బాధ్యత చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పాక చిరంజీవి, చింతల ఉమామహేశ్వరి సాయిలు, ఎండి హను బాయ్, బత్తుల జయమ్మ దాస్, వైద్యాధికారులు సుమన్ కళ్యాణ్, కాటమ రాజు, పాండు రంగారావు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.