మే 1 నుంచి గ్యాస్ కొత్త రూల్స్! ఓటీపీ లేకపోతే సిలిండర్ రాదు!
హైదరాబాద్ న్యూస్‌టైమ్ - బిజినెస్ డెస్క్: వంట గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1వ తేదీ నుంచి ఎల్‌పీజీ (LPG) సిలిండర్లకు సంబంధించి కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. కేవలం ధరలే కాకుండా, బుకింగ్ మరియు డెలివరీ ప్రక్రియలో కూడా కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
1. డెలివరీకి OTP తప్పనిసరి (DAC): ఇకపై సిలిండర్ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP (One Time Password) ని డెలివరీ బాయ్‌కు చెబితేనే సిలిండర్ అప్పగిస్తారు. సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్, దొంగతనాలను అరికట్టడానికి కంపెనీలు ఈ 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (DAC) నిబంధనను కఠినతరం చేస్తున్నాయి.
2. బుకింగ్ గ్యాప్‌లో మార్పులు: రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస గడువుపై కొత్త నిబంధనలు రానున్నాయి. ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత, నిర్దేశిత రోజుల గ్యాప్ ఉంటేనే రెండో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా గృహ అవసరాల సిలిండర్లను కమర్షియల్ పనులకు వాడకుండా అడ్డుకోవడానికే.
3. గ్యాస్ ధరల అప్డేట్: ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరల ఆధారంగా మే 1న గృహ అవసరాల సిలిండర్ లేదా కమర్షియల్ సిలిండర్ల ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. పెరగనుందా లేక తగ్గనుందా అనేది రేపు ఉదయం స్పష్టత రానుంది.
4. కేవైసీ (KYC) అప్డేట్: చాలా కాలంగా కేవైసీ పూర్తి చేయని కనెక్షన్లపై గ్యాస్ ఏజెన్సీలు నిఘా పెంచాయి. మే 1 లోపు కేవైసీ పూర్తి చేయని పక్షంలో సబ్సిడీ ఆగిపోవడమే కాకుండా, బుకింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదురవ్వచ్చు.