మేడ్చల్‌లో నకిలీ వైన్ తయారీ కేంద్రంపై దాడులు: భారీగా మద్యం స్వాధీనం!

Published on: 08 Jul 2026, 12:58 PM
News Article

కాప్రా, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మేడ్చల్ జిల్లా కాప్రా పరిధిలో అక్రమంగా ఫ్రూట్ వైన్ తయారు చేస్తున్న కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే 7 రకాల పండ్లను ఉపయోగించి నకిలీ వైన్‌ను తయారు చేస్తున్న ఆంథోనీ పీటర్ (65) అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో భాగంగా నిందితుడి వద్ద నుండి సుమారు 377.7 లీటర్ల వైన్‌తో పాటు సిద్ధం చేసిన 502 బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తయారు చేస్తున్న ఈ వైన్ ఆరోగ్యానికి ప్రమాదకరమని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.