మేడ్చల్‌లో విషాదం: అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Published on: 25 Jul 2026, 02:01 AM
News Article

మేడ్చల్, జూలై 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మేడ్చల్ జిల్లా నాగారం వెస్ట్ గాంధీ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి దీక్షిత (26) అనే పీజీ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో పీజీ ఆప్తాల్మాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దీక్షిత, ప్రస్తుతం స్వగ్రామానికి వచ్చింది. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి గల అసలు కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.