మోదీ మేజిక్.. బీజేపీ శ్రేణుల 'విజయ' తాండవం!
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 04, 2026 న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభంజనం సృష్టించడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం (BJP HQ) వద్ద కార్యకర్తల కోలాహలం మిన్నంటింది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు.. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హెడ్ క్వార్టర్స్‌ను హోరెత్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన బీజేపీ శ్రేణులు తమ తమ సంప్రదాయ నృత్యాలతో విజయోత్సవాల్లో మునిగిపోయారు. గెలుపు ధీమాతో ఉన్న అగ్రనేతలు కూడా కార్యాలయానికి చేరుకోవడంతో సందడి రెట్టింపయ్యింది. ఈ గెలుపు కేవలం పార్టీదే కాదని, దేశ ప్రజల విజయమని బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా బీజేపీ విజయానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.