యూట్యూబర్ రావణ్‌కు మళ్ళీ చిక్కులు: బెయిల్ రాగానే మరో కేసులో అరెస్ట్!
Published on: 02 Jul 2026, 04:20 AM
హైదరాబాద్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వివాదాస్పద యూట్యూబర్ రావణ్‌కు మళ్ళీ అరెస్ట్ కష్టాలు ఎదురయ్యాయి. పిఠాపురంలో నిన్న రాత్రి రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా అతనికి మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అయితే, జైలు నుండి విడుదలైన వెంటనే సర్పవరం పోలీసులు మరో కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2025లో పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో గతంలోనే ఫిర్యాదు చేయగా, ఆ కేసులో భాగంగానే ప్రస్తుతం రావణ్‌ను సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.