యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య!

Published on: 17 Mar 2026, 05:43 AM
News Article
జగిత్యాల జిల్లా: కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ భర్త.. నాలుగు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు.

ప్రేమ వివాహం: ఎనిమిది నెలల క్రితం యూట్యూబర్‌గా మంచి గుర్తింపు ఉన్న వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ముదిరిన మనస్పర్థలు: వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ తీవ్రస్థాయికి చేరింది.

కత్తితో దాడి: కోపంతో ఊగిపోయిన హరిబాబు.. భార్య వైష్ణవి (4 నెలల గర్భిణీ) పై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

పోలీసుల దర్యాప్తు: సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు హరిబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కుటుంబ సభ్యుల ఆగ్రహం: కడుపులో బిడ్డతో ఉన్న తమ కూతురిని పొట్టనబెట్టుకున్న నిందితుడిపై వైష్ణవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిబాబుకు వెంటనే ఉరిశిక్ష విధించాలని, లేని పక్షంలో తామే అతన్ని చంపేస్తామని కన్నీరుమున్నీరుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.