రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీల‌క భేటీ

Published on: 18 Mar 2026, 09:01 AM
News Article
న్యూఢిల్లీ (హైదరాబాద్ న్యూస్ టైమ్):
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల బృందం సమావేశమైంది.

ఢిల్లీలో జరిగిన ఈ ప్రత్యేక భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నూతన ఎంపీ వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతంపై అమలు చేయాల్సిన వ్యూహాలపై అధిష్టానంతో వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

నూతన ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వేం నరేందర్ రెడ్డి, అలాగే టీపీసీసీ పీఠం అధిరోహించిన మహేష్ కుమార్ గౌడ్.. అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిసి తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరియు పార్టీ మధ్య సమన్వయం పెంచుకుంటూ, ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై అధిష్టానం ఈ సందర్భంగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.