రైతులు, కూలీల వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి! వామపక్ష నేతలు
గట్టుప్పల, ఆగస్ట్ 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): గట్టుప్పలలో సోమవారం రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చాపల మారయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కర్నాటి సుధాకర్ మాట్లాడుతూ.. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, కూలీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు; కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ద్వారా 8 గంటల పనివేళలను 12 గంటలకు పెంచుతూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని, అసంఘటిత రంగం మరియు ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు; ఈ కార్యక్రమంలో ముస్కు బుచ్చిరెడ్డి, రావుల నరసింహ, కర్నాటి వెంకటేశం, అచ్చిని శ్రీనివాస్, ఖమ్మం రాములు, వల్లూరు శ్రీశైలం, టేకుమట్ల కృష్ణ, పర్సగోని యాదగిరి, పెదగాని నరసింహ, రేవెల్లి సత్తయ్య, చిక్కుల సైదులు, బొల్లెపల్లి పుల్లయ్య, చంద్రయ్య, బండారి కృష్ణయ్య, బొబ్బల చంద్రయ్య, దుబ్బాక శంకరయ్య, కురుమతి వెంకటేశం, ఖమ్మం మహేష్, భీమగాని రాణి, విడం వేదవతి, కర్నాటి లక్ష్మి, ఎరుపుల సైదులు, భీమనపల్లి ముత్తయ్య, అబ్బయ్య, అంజమ్మ, శంకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.