వామ్మో.. రవివర్మ పెయింటింగ్ కు అంత ధర !
Published on: 03 Apr 2026, 11:37 AM
ముంబై: భారతీయ ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ఓ అరుదైన పెయింటింగ్ వేలంలో సంచలనం సృష్టించింది. 1890వ దశకంలో ఆయన అద్భుతంగా గీసిన 'యశోద-చిన్ని కృష్ణుడు' ఆయిల్ పెయింటింగ్.. ముంబైలో జరిగిన సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్‌లో ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అపురూప కళాఖండాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దక్కించుకున్నారు.