వారాహి కన్సల్టెన్సీ బోర్డు తిప్పేసింది!

Published on: 17 Mar 2026, 12:57 PM
News Article
గుంటూరు: షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో అమాయక ప్రజల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడిన ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అరండల్‌పేటలోని 'నవ్యశ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ' నిర్వాహకుడు అన్నం వెంకట పూర్ణచంద్రరావు కోట్లాది రూపాయలతో పరారయ్యాడు.

ఆకర్షణీయమైన ఆఫర్: ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే.. 20 నెలల పాటు నెలకు రూ. 10 వేల చొప్పున (మొత్తం రూ. 2 లక్షలు) ఇస్తానని నమ్మించాడు.

నమ్మకం కలిగించి: షేర్ మార్కెట్‌లో తనకు పట్టు ఉందని, నష్టాల బాధ్యత తనదేనంటూ బాండ్లు, చెక్కులు ఇచ్చి నమ్మబలికాడు. ప్రారంభంలో కొందరికి సక్రమంగా చెల్లింపులు చేసి భారీగా డిపాజిట్లు సేకరించాడు.

ముంచేసి పరార్: ఈ ఏడాది జనవరి నుంచి పేమెంట్లు నిలిపివేసి, సాకులు చెబుతూ వచ్చిన పూర్ణచంద్రరావు.. ఈ నెల 13న కుటుంబంతో సహా పరారయ్యాడు. సుమారు రూ. 2 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.