వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత.. కారణం వెల్లడించిన అమెరికా విదేశాంగ శాఖ
Published on: 26 Aug 2026, 04:01 AM
వాషింగ్టన్, ఆగస్ట్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన కొన్ని ఇంటర్వ్యూలను కూడా రద్దు చేసినట్లు సమాచారం.
అమెరికా విదేశాంగ శాఖ స్పష్టత: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీ కార్యాలయాలు మరియు కాన్సులేట్‌లలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ప్రారంభమైందని, అందుకే వీసా అపాయింట్‌మెంట్ల జారీ ప్రక్రియలో తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ పరిణామంతో విద్యార్థులు, ఉద్యోగార్థులు మరియు పర్యాటక వీసాలపై అమెరికా వెళ్లాలనుకునేవారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది.