వెంకంభావి తండా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రామావత్ రాజు నాయక్ ఎన్నిక

Published on: 27 Jul 2026, 01:07 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, జూలై 27, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంభావి తండాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దల సమక్షంలో రామావత్ రాజు నాయక్‌ను ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ తండా నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రామావత్ రాజు నాయక్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తనవంతు పూర్తిగా కృషి చేస్తానని, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకూ తీసుకెళ్లి, గ్రామ అభివృద్ధికి అందరినీ కలుపుకొని సమష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పానుగోతు వసంత బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కరంటోతు విజయభాస్కర్, కరంటోతు రవి, కార్యదర్శులు హతీరామ్, కరంటోతు రమేష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని రామావత్ రాజుకు అభినందనలు తెలిపారు.