వెనిజులా భూకంపం: 235కు చేరిన మృతుల సంఖ్య.. పెరిగిన తీవ్రత!
Published on: 26 Jun 2026, 02:27 AM
హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వెనిజులాలో సంభవించిన వినాశకర జంట భూకంపాల ధాటికి మరణించిన వారి సంఖ్య మరింత పెరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ (AP) వార్తా సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు దాదాపు 235 మంది ప్రాణాలు కోల్పోగా, గాయపడిన వారి సంఖ్య ఏకంగా 4,300కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే కొద్దీ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని, ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు, రెస్క్యూ ఆపరేషన్లు యుద్ధప్రతిపాదికన కొనసాగుతున్నాయి.