వైభవంగా పెద్దిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం..ఆలయానికి చలమల్ల భారీ విరాళం
Published on: 19 Jun 2026, 03:56 PM
సంస్థాన్ నారాయణపురం, జూన్ 19 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి ఈ వేడుకలకు విశేష అతిథిగా హాజరై, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవాలయ అభివృద్ధి కోసం తన వంతుగా ఆలయ కమిటీకి రూ. 1,00,116 (లక్షా నూట పదహారు రూపాయలు) ఆర్థిక విరాళాన్ని అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు.