శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, పాల్గొన్న MLA రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, ఆగస్ట్ 15, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారము అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి వెంకటలక్ష్మి సమక్షంలో నూతన చైర్మన్‌గా బొబ్బిళ్ళ మురళి గురు స్వామి, ధర్మకర్తలుగా గుగులోతు అరుణ శంకర్ నాయక్, వరకాల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ, దేవాలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ బొబ్బిళ్ళ మురళి ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోగదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, పబ్బు రాజు గౌడ్, వెన్ రెడ్డి రాజు, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, భక్తులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.