సంగం పెరుగులో ఎలుక..
వరంగల్, జూన్ 23 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రముఖ డెయిరీ బ్రాండ్ 'సంగం' (Sangam) పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక పిల్ల ప్రత్యక్షం కావడం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వరంగల్ నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌తోట సమీపంలో ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఓ వినియోగదారుడు సంగం పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి కట్ చేసి చూడగా.. అందులో చనిపోయిన ఎలుక పిల్ల ఉండటాన్ని చూసి కంగుతిన్నాడు. వెంటనే దుకాణ యజమానిని నిలదీసి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఆ కిరాణా దుకాణాన్ని పరిశీలించి, సదరు బ్యాచ్‌కి చెందిన ప్యాకెట్ల అమ్మకాలను తక్షణమే నిలిపివేశారు. అప్రమత్తమైన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి.. జనగామలో 50 ప్యాకెట్లతో పాటు కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హనుమకొండలోని భవానీనగర్ తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో ఆ బ్యాచ్‌కు చెందిన ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి.. ఆ బ్యాచ్‌కు సంబంధించిన పెరుగు అమ్మకాలను పూర్తిగా నిలిపివేశామని, సీజ్ చేసిన శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు.ప్రముఖ డెయిరీ బ్రాండ్ 'సంగం' (Sangam) పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక పిల్ల ప్రత్యక్షం కావడం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వరంగల్ నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌తోట సమీపంలో ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఓ వినియోగదారుడు సంగం పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి కట్ చేసి చూడగా.. అందులో చనిపోయిన ఎలుక పిల్ల ఉండటాన్ని చూసి కంగుతిన్నాడు. వెంటనే దుకాణ యజమానిని నిలదీసి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఆ కిరాణా దుకాణాన్ని పరిశీలించి, సదరు బ్యాచ్‌కి చెందిన ప్యాకెట్ల అమ్మకాలను తక్షణమే నిలిపివేశారు. అప్రమత్తమైన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి.. జనగామలో 50 ప్యాకెట్లతో పాటు కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హనుమకొండలోని భవానీనగర్ తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో ఆ బ్యాచ్‌కు చెందిన ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి.. ఆ బ్యాచ్‌కు సంబంధించిన పెరుగు అమ్మకాలను పూర్తిగా నిలిపివేశామని, సీజ్ చేసిన శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు.