సంస్థాన్ నారాయణపురం చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా చిలుకూరి శ్రీనివాస్!

Published on: 12 Jul 2026, 01:03 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, జూలై 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల చేనేత సహకార సంఘం నూతన పాలకమండలి ఎన్నికలు ఎన్నికల అధికారి కె. ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికైన నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా చిలుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పగిడిమర్రి విష్ణు, ప్రధాన కార్యదర్శిగా దోర్నాల అంజయ్య, కోశాధికారిగా సంగిశెట్టి అనంత ఎన్నికయ్యారు. అలాగే సభ్యులుగా వంగరి రఘు, మేకని యాదగిరి, దువ్వ విజయలక్ష్మి, గోశిక స్వామి, సూరపెల్లి రాములు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, చేనేత సహకార సంఘాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మేనేజర్ విడెం వెంకటేశం, ప్రొడక్షన్ ఇంచార్జ్ గుర్రం సత్యనారాయణ, పలువురు చేనేత పారిశ్రామికులు పాల్గొన్నారు.