సంస్థాన్ నారాయణపురం పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా సురపల్లి గణేష్ నేత ఏకగ్రీవ ఎన్నిక

Published on: 06 Sep 2026, 03:45 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుగా సురపల్లి గణేష్ నేత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశాలి యువజన సంఘం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని, యువజన సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు మరియు పద్మశాలి కుల బాంధవులకు తన వంతు సహకారం అందిస్తూ శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి రాజకీయ విభాగం అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ బొల్లా శివశంకర్, బీజేపీ నాయకులు వంగర రఘు, చేనేత సహకార సంఘం డైరెక్టర్ దువ్వ విజయలక్ష్మి అంజయ్య, వార్డ్ మెంబర్ సురపల్లి వెంకటేష్ నేత, లాయర్ గర్దాస్ రాఘవేంద్ర, విడం సాయి కిషోర్ నేత, సింగం కృష్ణ, సురపల్లి జోహార్, దువ్వ నవీన్ తదితరులు పాల్గొన్నారు.