సంస్థాన్ నారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ.. శుభాకాంక్షలు తెలిపిన నేతలు!
సంస్థాన్ నారాయణపురం, జూన్ 17 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని లింగవారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కత్తుల సౌజన్య-భానుప్రకాష్ దంపతుల నూతన గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ జ్యోతి వాసు, ఉప సర్పంచ్ పల్లె లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కత్తుల లక్ష్మయ్య, మరియు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల అశోక్ కుమార్ విచ్చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిరుపేదల ఆత్మగౌరవానికి, గౌరవప్రదమైన జీవితానికి ఇందిరమ్మ ఇళ్లే నిదర్శనమని ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడగా, ఈ గృహప్రవేశ వేడుకలో గ్రామ సెక్రెటరీ, వార్డు మెంబర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.