సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా పెద్దిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం!

Published on: 19 Jun 2026, 03:52 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, జూన్ 19 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ముఖ్యఅతిథులుగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, మాజీ ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి హాజరై స్వామి, అమ్మవార్ల కళ్యాణంలో పాల్గొని దీవెనలు పొందారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మందుగుల బాలకృష్ణ, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఉప్పరగొని యాదయ్య, మాజీ అధ్యక్షుడు నిమ్మల నాగేష్ ముదిరాజ్, వార్డు సభ్యులు సూరపెళ్లి వెంకటేష్, పందుల యాదగిరి గౌడ్, బల్గూరి శివ, పట్నం బాలకృష్ణ, సింగం బిక్షపతి, కట్ల వనజ భాస్కరాచారి, నీళ్ల అనిత శంకర్, చింతల శైలజ సత్యనారాయణ, సింగపంగా ప్రశాంతి రమేష్, రాచకొండ రమేష్ బాబు, గునిగంటి రాజు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు తదితర ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.