సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు
సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 2 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలను సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నారాయణపురం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేదల పాలిట ఆపద్బాంధవుడని కొనియాడారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, పేదల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ, నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు లాంటి అనేక బృహత్తర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన గొప్ప నాయకుడని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మందుగుల బాలకృష్ణ, కత్తుల లక్ష్మయ్య, కుక్కల నరసింహ, మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నర్సింహ, ఏపూరి సతీష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రత్తపల్లి యాదయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెగావత్ రెడ్యా నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ, రాచకొండ రమేష్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కొండ నవీన్ గౌడ్, బానోత్ కిరణ్ నాయక్, ఒకటవ వార్డు మెంబర్ బలుగూరి శివకుమార్, రేవనపల్లి గోపాలు, గునిగంటి రాజు గౌడ్, ఏపూరి గోపాల్, ఎండి అబ్బు, బద్దుల యాదగిరి, గాలయ్య, వలిగొండ మాధవులు, ఎర్రోళ్ల కంచయ్య, చిలువేరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.