సంస్థాన్ నారాయణపురంలో జాంబవ కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

Published on: 01 Sep 2026, 04:24 AM
News Article

సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 1, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గుండ్లమెట్ట జాంబవ కుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. సంఘం గౌరవ అధ్యక్షుల చేతుల మీదుగా, సుక్క రాములు, పొట్ట పెద వెంకటేష్ ఆధ్వర్యంలో కుల సభ్యులందరి సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా వడ్డేపల్లి రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గం వివరాలు ఇవే.. అధ్యక్షుడిగా వడ్డేపల్లి రాములుతో పాటు, ఉపాధ్యక్షుడిగా చెరుకుపల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా జనగాం రాజు, కోశాధికారిగా చెరుకుపల్లి కృష్ణ, సహాయ కార్యదర్శిగా రేవనపల్లి యాదగిరిలను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి, ఇతర కార్యవర్గ సభ్యులకు కుల సంఘ నాయకులు, సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కమిటీ నేతలు మాట్లాడుతూ.. తమపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తూ.. సంఘాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.