సంస్థాన్ నారాయణపురంలో నూతన వెజిటబుల్ షాప్ ప్రారంభం..
సంస్థాన్ నారాయణపురం, జూన్ 20 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 'శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెజిటబుల్ హోల్‌సేల్ అండ్ రిటైల్ షాప్'ను స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నారాయణపురం పట్టణ ప్రజలకు నాణ్యమైన, తాజా కూరగాయలను ఎల్లప్పుడూ సరసమైన ధరలకే అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం షాప్ నిర్వాహకుడు సంజీవ.. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మందుగుల బాలకృష్ణ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, వార్డు సభ్యులు సూరపెల్లి వెంకటేశం, బల్గూరి శివ, సింగపంగా ప్రశాంతి రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉప్పల నాగరాజు, కొండ నవీన్ గౌడ్, బద్దుల యాదగిరి, ఎండి నజీముద్దీన్, ఉష్కగుల గిరిబాబు తదితరులతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.