సర్వేల్ కాంగ్రెస్ నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా వీరమల్ల వినోద్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక!
సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 29, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షుడి ఎంపికను అత్యంత ఘనంగా నిర్వహించారు. సర్వేల్ సర్పంచ్ చిలకరాజు చందన రాజు ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వీరమల్ల వినోద్ గౌడ్‌ను గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే సమావేశంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పబ్బతి ఆకాష్ గౌడ్‌ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తామని, ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా శ్రేయస్కర సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలోని ప్రతి ఇంటికి చేర్చి పార్టీని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ దేవాలయ చైర్మన్లు, వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు, వివిధ స్థాయిల కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను ఈ సందర్భంగా నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.