సర్వేల్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షుడిగా వెనుముల శంకర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Published on: 05 Sep 2026, 02:38 AM
News Article

సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 5, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ నూతన అధ్యక్షుడిగా వెనుముల శంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ప్రజల సర్వసమ్మతితో ఈ నియామకం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ​ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెనుముల శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. దేవుని ఆశీస్సులతో ఆలయ సర్వతోముఖాభివృద్ధికి తన వంతు పూర్తి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించి, ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో చిలక రాజు, దేవాలయ మాజీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వినోద్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపారు.