సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

Published on: 04 Jul 2026, 05:22 AM
News Article

హైదరాబాద్, జూలై 04, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట తీసుకున్న అప్పులను చెల్లించకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని తన ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 8.50 కోట్లకు వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, అక్కడ తనకు అనుకూలంగా తీర్పు పొందారు. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించగా, ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, ఆస్తుల వేలం సరైన నిర్ణయమేనని స్పష్టం చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సానుకూలంగా తీర్పు ఇచ్చింది.