సీఎం రేవంత్‌తో వెమ్ టెక్నాలజీస్ సీఎండీ భేటీ!
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 04, 2026 హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని వెమ్ టెక్నాలజీస్ (VEM Technologies) డిఫెన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకులు, సీఎండీ వి. వెంకట రాజు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జహీరాబాద్‌లోని నిమ్జ్ (NIMZ) లో వెమ్ టెక్నాలజీస్ కొత్త యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహకారంపై వెంకట రాజు గారు హర్షం వ్యక్తం చేశారు. డిఫెన్స్ రంగంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించనున్న ఈ యూనిట్ ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎంకు వివరించారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను డిఫెన్స్ హబ్‌గా మార్చే క్రమంలో ఈ కొత్త యూనిట్ కీలక పాత్ర పోషించనుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.