సీఎం స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి ఘనవిజయం
చెన్నై, హైదరాబాద్ న్యూస్‌టైమ్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనం నమోదైంది; డీఎంకే కంచుకోట కోలత్తూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ అనూహ్య పరాజయాన్ని చవిచూశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి వీఎస్ బాబు, ముఖ్యమంత్రిపై సుమారు 8,795 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించి రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ పోలికలతో ఉన్న 'విజయ్ మది' అనే కళాకారుడిని రంగంలోకి దించి, వినూత్న శైలిలో ఓటర్లను ఆకర్షించిన వీఎస్ బాబు వ్యూహం ఫలించింది. డీఎంకే నుంచి టీవీకేలో చేరిన వెటరన్ నేత బాబు, విజయ్ క్రేజ్‌ను సమర్థవంతంగా వాడుకుని స్టాలిన్ హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ వేశారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం తమిళ రాజకీయ చరిత్రలో పెను మార్పుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.