సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు
Published on: 18 Mar 2026, 08:08 AM
హైదరాబాద్ (హైదరాబాద్ న్యూస్ టైమ్):
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకో నమ్మడం లేదని కూనంనేని అభిప్రాయపడ్డారు. కేవలం అధికారంలోకి రావాలనే లక్ష్యంతో, ఆచరణ సాధ్యం కాని, అమలు చేయలేని హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, అందుకే క్షేత్రస్థాయిలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐకి చెందిన కీలక నేత స్వయంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల హామీలు, ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తరుణంలో కూనంనేని సాంబశివరావు చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.