సీబీఎస్ఈ 12వ తరగతిలో అరుదైన రికార్డ్..
రాంచీ, జూన్ 22 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన అవ్నీ కేజ్రీవాల్ అనే విద్యార్థిని సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి ఫలితాల్లో రీ-వాల్యుయేషన్ (పునఃమూల్యాంకనం) తర్వాత ఏకంగా 500కు 500 మార్కులు సాధించి అరుదైన రికార్డు సృష్టించింది. తనకెంతో ఇష్టమైన, అత్యంత పట్టున్న ఇంగ్లీష్ సబ్జెక్టులో 19 మార్కులు, బిజినెస్ స్టడీస్‌లో 5 మార్కులు తగ్గడంతో తాను తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యానని, తనపై ఉన్న నమ్మకంతోనే రీ-వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నానని అవ్నీ తెలిపింది. అప్పటికే మూడు సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు సాధించిన తనకు, తాజా రీ-వాల్యుయేషన్‌లో మరో 24 మార్కులు అదనంగా కలవడంతో మొత్తం స్కోరు 500కి 500 చేరిందని ఆనందం వ్యక్తం చేసింది. "అసలు పూర్తి మార్కులు వస్తాయని మేము ఊహించలేదు.. నా మార్కులు పెరగడంతో ఇప్పుడు మా కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నాం" అని అవ్నీ కేజ్రీవాల్ సగర్వంగా పేర్కొంది.