సోంపల్లిలో జూదరుల గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్!

Published on: 16 May 2026, 12:08 PM
News Article
  • ముద్దనూరు పోలీసుల మెరుపు దాడులు..
  • రూ.33,800 నగదు స్వాధీనం
  • 'లోపలా బయటా' జూదంపై..
  • ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు

హైదరాబాద్ న్యూస్ టైమ్, ముద్దనూరు: ముద్దనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సోంపల్లి గ్రామంలో అక్రమంగా సాగుతున్న జూద స్థావరంపై శనివారం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. లభించిన నమ్మకమైన సమాచారం మేరకు ముద్దనూరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో సిబ్బంది సోంపల్లిలో దాడులు చేయగా, అక్కడ చట్టవిరుద్ధంగా “లోపలా బయటా” అనే పేకాట జూదం ఆడుతున్న 11 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని తక్షణమే అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనాస్థలం నుండి రూ. 33,800/- నగదుతో పాటు 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ జూదం ఉదంతంపై ముద్దనూరు పోలీసులు Cr.No.44/2026, U/s 9(1) A.P. Gaming Act (ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.