స్థానిక సంస్థలకు రూ. 5 వేల కోట్ల నిధుల నిలిపివేత

Published on: 02 Jul 2026, 02:15 AM
News Article

హైదరాబాద్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు అందాల్సిన సుమారు రూ. 5 వేల కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని తాజా సమాచారం. ఇందులో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ. 1,090 కోట్ల బకాయిలు నిలిచిపోగా, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్లు రూ. 2,979 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిలు మరో రూ. 1,200 కోట్లుగా ఉన్నాయని, భవిష్యత్తులో 16వ ఆర్థిక సంఘం నిధులను పొందే ప్రక్రియలో కఠినమైన నిబంధనలు కూడా అడ్డంకిగా మారాయని నివేదికలు పేర్కొంటున్నాయి.