స్వాతంత్య్ర‌ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు బహుమతుల పంపిణీ

Published on: 15 Aug 2026, 02:21 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 15, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): విద్యార్థులు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని బీకే యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ బద్దుల మురళి కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బీకే యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, వార్డు సభ్యులు సురపల్లి వెంకటేష్, పందుల యాదగిరి, ఫౌండేషన్ సభ్యులు రాసాల యాదయ్య, పాషా, ఉప్పల రవికుమార్, ప్రధానోపాధ్యాయులు రమాదేవి, రఘుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.