హన్మకొండలో కారులో మహిళ మృతదేహం కలకలం.. గోదావరిఖని యువతిగా గుర్తింపు

Published on: 21 Aug 2026, 06:47 AM

హన్మకొండ, ఆగస్ట్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): హన్మకొండలో కారులో అనుమానాస్పద స్థితిలో దొరికిన మృతదేహం గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానస అనే యువతిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలి వివరాలను సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి వినోద్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కరీంనగర్‌లోని ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ (మూర్ఛ) వచ్చి అకస్మాత్తుగా మృతి చెందిందని, ఆ భయంతోనే తాను ఆమె మృతదేహాన్ని కారులో వదిలిపెట్టి వెళ్ళినట్లు వినోద్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. ఈ కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.