11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

హైదరాబాద్‌లో ‘ఇసుక’ దందా: సామాన్యుడి జేబుకు చిల్లు.. ఇటు లారీ ఓనర్ల కన్నీళ్లు!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైద‌రాబాద్ న్యూస్ టైమ్: హైదరాబాద్ ఇసుక మార్కెట్ ఇప్పుడు బ్రోకర్ల గుప్పిట్లో చిక్కుకుంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రాణాలకు తెగించి, వ్యయప్రయాసలకోర్చి ఇసుకను చేరవేస్తున్న లారీ యజమానులకు దక్కేది ‘అడ్డికి పావుశేరు’ అయితే, ఏ కష్టమూ లేకుండా మధ్యలో చక్రం తిప్పుతున్న ఇసుక దందా బ్రోకర్లు మాత్రం ‘కోట్లు గడిస్తున్నారు’. సామాన్యుడి సొంతింటి కలను ఈ దందా బ్రోకర్లు కరిగిస్తున్నారు.

మొదట వెయిబ్రిడ్జ్ మోసం.. ఆపరేటర్లే కీలకం!

హైదరాబాద్‌లోకి ఉదయం పూట భారీ వాహనాలకు అనుమతి లేకపోవడంతో, రాత్రి వేళల్లో అన్-లోడింగ్ జరుగుతోంది. ఇదే బ్రోకర్లకు వరంగా మారింది

ఆపరేటర్ల కొనుగోలు: వెయిబ్రిడ్జి ఆపరేటర్లకు కంపెనీ ఇచ్చే జీతం కంటే రెట్టింపు మొత్తాన్ని బ్రోకర్లు ముట్టజెబుతూ, రీడింగ్‌లో మ్యాానిప్యులేషన్ చేయిస్తున్నారు.

అప్రమత్తంగా ఉన్నా.. దారిదోపిడీ ‘కటింగ్’ దందా!

బ్రోకర్ల మాయాజాలం ఎంతలా ఉందంటే, వినియోగదారుడు అప్రమత్తంగా ఉండి వెయిబ్రిడ్జ్ వద్ద స్వయంగా నిలబడి రీడింగ్ చూసుకున్నా సరే మోసపోక తప్పని పరిస్థితి నెలకొంది.

దారి మళ్లించి దోపిడీ: వెయిబ్రిడ్జ్ నుంచి కస్టమర్ సైట్‌కు వెళ్లే మధ్యలోనే బ్రోకర్లు తమ సొంత టిప్పర్లను సిద్ధంగా ఉంచుతారు. లారీ సైట్‌కు వెళ్లే లోపే, మార్గమధ్యలో ఆపి ఆ లోడులో నుంచి 10 నుండి 15 టన్నుల ఇసుకను తమ టిప్పర్లలోకి మార్చేస్తారు. కస్టమర్ సైట్ వద్దకు వెళ్లేసరికి మళ్ళీ పాత లెక్కే (35 టన్నులు) చెబుతూ అన్-లోడ్ చేస్తారు. ఇలా కళ్లముందే నిలువు దోపిడీ చేస్తూ కోట్లు గడిస్తున్నారు.

అక్రమాల నెట్ వర్క్.. బ్రోకర్ల మాయాజాలం! సైట్లలో సెటిల్మెంట్లు:  

పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్టుల వద్ద సొంత వెయిబ్రిడ్జిలు నిర్మించుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అక్కడ పనిచేసే ఆపరేటర్లకు కూడా బ్రోకర్లు ఆశజూపి, యాజమాన్యం కళ్లుగప్పి తక్కువ లోడ్‌ను ఎక్కువ వెయిట్‌గా చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థల్లో పనిచేసే సూపర్‌వైజర్లు, వాచ్‌మెన్లను మచ్చిక చేసుకుని, 25 టన్నుల లోడు అన్-లోడ్ చేసి 35 టన్నుల బిల్లు పెడుతూ దోపిడీ చేస్తున్నారు.

మార్కెట్ మాయ-తక్కువ ధర అనే ఉచ్చు: లారీ ఓనర్లు విక్ర‌యించే అసలు ధర కంటే తక్కువకే ఇస్తామంటూ బ్రోకర్లు వినియోగదారులను ఆకర్షిస్తారు. కానీ క్వాంటిటీలో భారీగా కోత కోసి, వినియోగదారుడిని అడ్డంగా ముంచుతున్నారు.

పరిష్కారం: ‘ఓలా - ఊబర్’ తరహాలో ‘సాండ్ బజార్’!

ఈ ఇసుక దందా బ్రోకర్ల వ్యవస్థను రూపుమాపాలంటే ప్రభుత్వం TGMDC సాండ్ బజార్ యాప్‌ను మరింత సరళతరం చేయాలి:

డైరెక్ట్ బుకింగ్ & లారీ అలర్ట్: కస్టమర్ బుక్ చేయగానే మధ్యవర్తి లేకుండా నేరుగా TGMDCలో రిజిస్టర్ అయిన లారీ ఓనర్లకు మెసేజ్ వెళ్లాలి. ఓలా, ఊబర్ క్యాబ్స్ లాగా అందుబాటులో ఉన్న వాహనాలకు సీరియల్ వైజ్ ఆర్డర్లు కేటాయించాలి.

GPS ట్రాకింగ్: లారీ స్టాక్ యార్డ్ నుంచి బయలుదేరినప్పటి నుండి కస్టమర్ సైట్‌కు చేరేవరకు మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా GPS ద్వారా ట్రాక్ చేయాలి. దీనివల్ల మధ్యలో 'కటింగ్' చేసే అవకాశం ఉండదు.

డిజిటల్ వెరిఫికేషన్: స్టాక్ యార్డ్ దగ్గర వేసిన వెయిట్‌కు, సైట్ దగ్గర వచ్చే వెయిట్‌కు తేడా లేకుండా డిజిటల్ రిసీట్స్ సిస్టమ్ రావాలి.

ముగింపు:

కష్టపడి ఇసుక తెచ్చే లారీ ఓనర్ల శ్రమను, సామాన్యుడి కష్టార్జితాన్ని దోచుకుంటున్న ఈ ఇసుక దందా బ్రోకర్ల నెట్‌వర్క్‌ను ప్రభుత్వం కఠినంగా అడ్డుకోవాలి. సాండ్ బజార్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చి, పారదర్శకమైన ఇసుక రవాణా వ్యవస్థను అమలు చేస్తేనే ఈ దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.