హైదరాబాద్‌లో రూ.18 కోట్ల రోలెక్స్ వాచీల దందా..
Published on: 09 Apr 2026, 04:18 AM
హైదరాబాద్: ఏప్రిల్ 09 (హైదరాబాద్ న్యూస్ టైమ్) హైదరాబాద్ వేదికగా సాగుతున్న లగ్జరీ వాచీల గుట్టును పోలీసులు రట్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పెద్దమొత్తంలో రోలెక్స్ వాచీలతో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 30 రోలెక్స్ గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.18 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ నుండి ముంబైకి వీటిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. అయితే, ఇవి అసలు రోలెక్స్ వాచీలా లేక బ్రాండెడ్ పైరేటెడ్ వాచీలా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.